ఇళ్లు కంటే ఆ బడి అంటేనే వాళ్లకు మక్కువ.. ఎందుకంటే..

ఏజెన్సీ ప్రాంతమైన వన్నాడలో గిరిజనులు తమ పిల్లల కోసం కళ తప్పిన బడిని అందంగా ఆధునీకరించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా, గ్రామస్తులంతా తలో చేయి వేసి పాడుబడిన పాఠశాలను మళ్లీ జీవంతో నింపేశారు. గోడల నిండా రంగులు, బొమ్మలు.. చుట్టూ సుందర వాతావరణం.. పిల్లలు ఇప్పుడు ఆనందంగా బడివైపు పరుగులు పెడుతున్నారు