ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్నంగా ఫ్లాన్ చేశాడు. ఆటో ఎక్కి ప్రయాణికులకు వినోదం పంచేందుకు టివి ఏర్పాటు చేశాడు. అంతేకాదు చిన్నపాటి ఫ్యాన్‌ను కూడా అమర్చాడు. ఆటోలో టవీ,ఫ్యాన్ చూసిన ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటి కోసం కోటి తిప్పలు అన్నట్లు, ఒక ఆటో డ్రైవర్ తన ఉపాధి కోసం ఆటోలో మినీ ఎల్ఈడీ టీవీని, ఫ్యాన్‌ను అమర్చి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు.