"అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కారు" అన్న సామెతను కొందరు ప్రబుద్ధులు నిజం చేస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని ఘటనలను ఎన్నో చూశాం.. ఈక్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కన్నతండ్రి పట్ల కొడుకులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో వారికి దిమ్మతిరిగేలా షాకిచ్చారు అధికారులు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని పట్టించుకోవట్లేదంటూ కొడుకుకు మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని సిరిసిల్ల ఆర్డీవో రద్దు చేశారు.