నూతన సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంబరాన్నంటాయి. కానీ ఓ కుటంబంలో మాత్రం అంతులేని విషాదాన్ని నింపింది. ఉదయాన్నే విద్యార్ధులకు స్కూల్‌కు తీసుకెళ్తున్న ఓ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో ఐదో తరగతి చవువుతున్న ఓ బాలిక స్కూల్ బస్సులో నుంచి జారి కింద పడి.. అదే బస్సు చక్రాల కింద నలిగిపోయింది. దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లో బుధవారం (జనవరి 1) చోటు చేసుకుంది.