ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించారు ఖమ్మం జిల్లాకు చెందిన యువతులు శ్రుతి, వినీల. ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొలపుడి శ్రుతి ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించారు. శ్రుతి తండ్రి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా తల్లి పోలీస్ శిక్షణ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. ఇంటర్ వరకు గురుకులంలో చదివిన శ్రుతి ఓ.యులో ఉన్నత విద్య పూర్తిచేశారు. ఒకే సారి ఎక్సైజ్ కానిస్టేబుల్, గురుకుల స్కూల్ లైబ్రేరియన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఈ.ఓ తో పాటు గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్, టి ఎస్ పి ఎస్సీ జే ఎల్ లైబ్రేరియన్‌గా ఉద్యోగాలు సాధించారు శ్రుతి. ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించిన శ్రుతిని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్తో పాటు పలువురు అధికారులు అభినందించారు.