తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జలాలు రగడ ఫీక్స్ చేరింది. ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం చెలరేగింది. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. నీటి నిల్వలను ఏపీ పూర్తిగా వినియోగించుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. రెండ్రోజుల క్రితం అడవిదేవులపల్లి దగ్గర టెయిల్ పాండ్‌ను సందర్శించారు నీటి పారుదల శాఖ కమిషనర్ సుల్తానియా.