హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకి చాలా మంది ప్రజలు వెళ్తుంటారు. సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి వెళ్తున్న వాళ్లతో పాటు స్నేహితులతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని వెళ్లే యువత కూడా ఎక్కువే. ముఖ్యంగా జూలో ఉన్న జంతువులను చూడటానికి చిన్నపిల్లలు చాలా ఆసక్తి కనబరుస్తారు.