పవిత్ర పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రం పరిసరాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. ప్రధాన గుడి వెనుక వైపు హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇది భక్తులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి..