అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 590 విమానం బుధవారం ఉదయం 8 గంటలకు ఫ్లోరిడాలోని టంపా ఎయిర్‌పోర్ట్ నుంచి ఫీనిక్స్ సిటీకి బయల్దేరింది. టేకాఫ్ అయ్యేందుకు టాక్సీ వే మీద నుంచి రన్‌వే మీదకు విమానం వచ్చింది. అయితే రన్‌వేపై విమానం వాలగానే ఒక్కసారిగా దాని కుడివైపు ఉన్న టైరు పేలిపోయింది. దీంతో విమానం చక్రాల్లోంచి నిప్పురవ్వలు ఎగసి.. పొగలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ రన్‌వేపై విజయవంతంగా విమానాన్ని టేకాఫ్ చేశాడు.