ఏలూరు, మార్చి 23: ఆ సుందర దృశ్యం అటువైపుగా వెళుతున్న పాదాచారుల్ని, వివాహనదారుల్ని కట్టిపడేస్తుంది. కాసేపైనా ఆ రమణీయమైన ప్రకృతి సుందర రూపాన్ని చూసి తీరాల్సిందేనని ఆ దృశ్యాన్ని చూసిన ప్రకృతి ప్రేమికులు చెప్పుకుంటున్నారు. భూమిపై పచ్చదనం కప్పి ముత్యాలు దానిపై పోసినట్టుగా మధ్యలో కలువల సోయగాలకు స్థానికులు మంత్రముగ్ధులవుతున్నారు.