ప్రకాశం బ్యారేజ్ నుండి ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో భారీ వరద లంక గ్రామాలను తాకింది. బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలంలోని పలు లంక గ్రామాలకు వెళ్లే మార్గానికి గండి పడింది. దీంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్క పాయ వద్ద గండి పడటంతో భారీ వరద కొల్లూరు కరకట్ట వద్దకు చేరింది.